Tech News Today Telugu – 01-01-2025

ఈ రంగాల్లో.. 10 లక్షల ఉద్యోగాలు

Tech News Today Telugu: క్వాంటమ్ కంప్యూటింగ్, జెనరేటివ్ AI టెక్నాలజీలు నేర్చుకున్న వారికి మంచి భవిష్యత్ ఉంటుందని క్వెస్ ఐటీ సాఫ్టింగ్ సంస్థ వెల్లడించింది. 2030 కల్లా 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది. AI, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీలు ఎన్నో మార్పులు తెస్తున్నాయంది. టెక్ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు టాప్ లో, HYD, పుణే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయంది.


BSNL New Year ఆఫర్స్: 7కే 3GB

Tech News Today Telugu: డేటా యూజర్ల కోసం BSNL 2 కొత్త ఆఫర్లు ప్రకటించింది. మొదటిది రూ.628 ప్లాన్. వ్యాలిడిటీ 84 రోజులు. మొత్తం 252GB డేటా వస్తుంది. రోజుకు 3GB వాడుకోవచ్చు. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ రూ.7 మాత్రమే. అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, గేమ్స్, పాడ్కాస్ట్, జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్టైన్మెంట్ లభిస్తాయి. ఇక రూ.215 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. మొత్తం 60GB డేటా వస్తుంది. రోజుకు 2GB వాడుకోవచ్చు. పై ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.


2024లో పెరిగిన సోషల్ మీడియా యూజర్లు

Tech News Today Telugu: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, థ్రెడ్, షేర్ చాట్, స్నాప్ చాట్, వాట్సాప్, యూట్యూబ్లో యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 520 కోట్ల మంది సోషల్ మీడియాను వాడుతున్నారు. ఇక కొత్తగా సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసిన వారు 28 కోట్లకు పైగానే ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వినియోగం 4 రెట్లు పెరిగింది. ఇక 2025లో మరింత దూసుకుపోయే అవకాశం ఉంది.


Whatsapp యూజర్లకు గుడ్ న్యూస్

వాట్సాప్ పేమెంట్ సేవలపై ఆంక్షలను కేంద్రం సడలించింది. దీంతో యూజర్లందరికీ ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది. 2020లో ప్రారంభమైన వాట్సాప్ పేమెంట్ సేవలను వాడుకునేందుకు తొలుత 4 కోట్ల మందికే అవకాశం ఉండేది. 2022లో దాన్ని 10 కోట్లకు NPCI పెంచింది. తాజాగా ఆ పరిమితుల్ని ఎత్తివేయడంతో 50 కోట్ల మందికి పైగా యూజర్లు వాడుకోవచ్చు. INDలో ప్రతి నెలా 13Bn లావాదేవీలు జరుగుతుండగా గూగుల్ పే, ఫోన్పే వాటా 85%గా ఉంది. Tech News Today Telugu


కొత్త డిజైన్తో iPhone 17 సిరీస్!

ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ లేటెస్ట్ iPhone వినియోగదారులను మోడల్స్లో ఆకట్టుకుంటోంది. కంపెనీ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ మోడల్స్ను విడుదల చేస్తుంది. అయితే ఐఫోన్ 17 సిరీస్ 2025లో విడుదల చేయనున్నట్టు యాపిల్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంలో ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్స్ ముందు, వెనుక ప్యానెల్ డిజైన్లలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని సమాచారం.Tech News Today Telugu


Year End.. Google స్పెషల్ డూడుల్!

నేటితో 2024వ సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ను విడుదల చేసింది. డార్క్ స్కై బ్యాక్ గ్రౌండ్ కి వ్యతిరేకంగా బోల్డ్ అక్షరాలతో ‘Google‘ రాసుకొచ్చింది. ముఖ్యంగా ‘O’ అక్షరం 12 అర్ధరాత్రిని సూచించే గడియారం పిన్గా ఉంచింది. 2025లో ప్రకాశవంతంగా ఉండండి.. అని కొత్త అవకాశాలతో కూడిన ప్రారంభాన్ని సూచిస్తోంది.


AI టెక్నాలజీని అడగకూడని ప్రశ్నలు!

Tech News Today Telugu: పెరుగుతున్న మానవ నాగరికతలో AI సాంకేతికత వినియోగం కూడా పెరుగుతోంది. ప్రపంచంలోని చాలా వరకు ప్రముఖ కంపెనీలు తమ AI సాఫ్ట్వేరు పరిచయం చేశాయి. AI సాంకేతికత సహాయకరంగా ఉన్నప్పటికీ.. ఇది ఆరోగ్య సలహా వంటి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని అడగకూడదు. పేరు, చిరునామా, ఈ మెయిల్ చిరునామా మొదలైన మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Airtel Users Get ₹17,000 Worth Perplexity Pro AI Subscription for FREE!
Airtel Users Get ₹17,000 Worth Perplexity Pro AI Subscription for FREE!

Redmi నుంచి కొత్త Smart Phone

Xiaomi Redmi Turbo 4 స్మార్ట్ఫోన్ను కొద్ది రోజుల్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రెడ్మీ టర్బో 4 డైమెన్షన్ 8400 చైనా మార్కెట్లో జనవరి 2వ తేదీన విడుదల కానుంది. అల్ట్రా
చిప్సెట్తో కూడిన మొదటి స్మార్ట్ఫోన్ ఇదే కావడం గమనార్హం.


బడ్జెట్ ధరలో VIVO Smart Phone లాంచ్!

Tech News Today Telugu: ప్రముఖ టెక్ కంపెనీ Vivo తన కొత్త Y295G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఇది 6.68-అంగుళాల LCD స్క్రీన్, MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ AI వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఇది 5,500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. దీని ధర రూ.13,999 నుంచి ప్రారంభమవుతుంది.


Apple నుంచి ఫోల్డబుల్ ఫోన్!

Apple యూజర్లకు గూడ్యూస్ వచ్చేస్తుంది. త్వరలోనే యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ రానుంది. యాపిల్ కొత్తగా రెండు ఫోల్డబుల్ డివైజులపై పని చేస్తోందని తెలుస్తోంది. క్లామల్ స్టైల్ ఐఫోన్, 20 అంగుళాల ఫోల్డబుల్ ఐప్యాడ్తో ఫోల్డబుల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల సమాచారం. 2026లో ఐఫోన్ 18తో ఈ ఫోల్డబుల్ మొబైల్ తీసుకొచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. Tech News Today Telugu 


ఈ ఏడాది పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు!

Tech News Today Telugu: 2024 సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరిగినట్టు పలు అధ్యయనాలు వెల్లడించాయి. నేషనల్ వెహికల్ రిజిస్ట్రీ డేటా ప్రకారం.. డిసెంబర్ 29వ తేదీ వరకు ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 26.50% పెరిగాయి. గత సంవత్సరంలో 15 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించగా, ప్రస్తుత సంవత్సరంలో 19.40 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రతినెలా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు దాదాపు లక్ష దాటుతున్నాయి.


ఈ టెక్ న్యూస్ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని comment రూపంలో తెలియచేయండి. > చదవండి టెక్ న్యూస్ 30-12-2024

Hello friends, my name is SUBBARAO K, I am the Writer and Founder of this blog and share all the information related to News & Technology, Make Money Online, Mobiles & Gadgets, Free Ai Tools, Useful Websites & Apps, Internet, Product Reviews, through this website...

Leave a Comment

error: Content is protected !!